సూర్య గ్రహణంపై గత కొన్నాళ్ళుగా విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఈ సూర్యగ్రహణం వల్ల పెనుముప్పు వాటిల్లుతుందని జ్యోతిష్కులు, పండితులు చెబుతుంటే శాస్తవ్రేత్తలు, జనవిజ్ఞానవేదిక వంటి సంస్థలు అంతరిక్షంలో జరగనున్న ఈ అద్భుతాన్ని సోలార్ ఫిల్టర్ లెన్స్ ద్వారా నిక్షేపంగా చూడవచ్చని చెబుతున్నారు.
గ్రహణ సమయాల్లో ఎలాంటి హానికర కిరణాలు వెలువడవని శాస్త్రజ్ఞులు వక్కాణిస్తున్నారు. వీరి అభిప్రాయాల ప్రకారం...![]()
సూర్యగ్రహణ సమయంలో ప్రత్యేకంగా హాని చేసే కిరణాలు ఏవి సూర్యుడి నుండి వెలువడవు.
గ్రహణం అంటే భూమి, సూర్యుడు, చంద్రుల మధ్య జరిగే దాగుడుమూతలాటలో వచ్చే నీడల కదలిక తప్ప మరొకటి కాదు.
గ్రహణ సమయంలో అదనపు భౌతిక చర్యలేవి సూర్యునిలో జరగవు. కావున ప్రత్యేక కిరణాలు ఏమి వెలువడవు.
కాబట్టి..
గ్రహణం సమయంలో ఆహారపదార్ధాలు కాని, నీళ్ళుకాని ఏవిధంగానూ చెడిపోవు.
వాటిని తీసుకోవడం వలన నష్టం ఏమి ఉండదు. మాములుగా ఎప్పటిలా తినవచ్చు, తాగవచ్చు.
గర్భిణీలకు గ్రహణం ఏవిధమైన హానిచేయదు.
గర్భంలో ఉండే శిశువులకు కూడా గ్రహణం ద్వారా ఏ విధమైన హాని కలుగదు.
నేతి బీరకాయలో నెయ్యి ఎలా ఉండదో, గ్రహణం మొర్రికి గ్రహణానికి కూడా సంబంధం ఉండదు.
అందుకని జీవితకాలంలో వచ్చే ఒక అద్భుత అవకాశాన్ని జారవిడుచుకోకుండా సంపూర్ణ సూర్యగ్రహణాన్నిచూడవచ్చు.
సూర్య చంద్ర గ్రహణాలు ఎప్పుడు ఏర్పడినా ప్రత్యేక కళ్లద్దాల ద్వారా వాటిని నిక్షేపంగా చూడొచ్చని శాస్త్రజ్ఞులు సూచిస్తున్నారు.
20 ఏళ్ల క్రితం సూర్యగ్రహణం ఏర్పడిందంటే పిల్లలను ఇళ్లలోంచి బయటకు రానిచ్చేవారు కాదు. ఇప్పుడు పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. కానీ మనుషులు, వారి విశ్వాసాలు మారవలసింది ఇంకా చాలానే ఉంది.
లోడ్ అవుతోంది...
స్పందనలు