Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

తలకు రంధ్రం పెడితే సరి... రోగం హుష్ కాకి...


చాలా కాలం క్రితం మన పూర్వీకులు దీనిని బలంగా నమ్మేవారు. వందలు లేదా వేల సంవత్సరాల క్రితం మనుషులకు తరచుగా తల నొప్పి వస్తున్న సందర్భాల్లో అలాంటి వారి తలకు రంధ్రం చేసేవారు. ఇంగ్లీషులో దీనిని ట్రెపానింగ్ అని పిలుస్తారు. చీటికీ మాటికీ తలనొప్పి వస్తున్నప్పుడు తలకు రంధ్రం చేస్తే నొప్పి మాయమవుతుందని ఆరోజుల్లో నమ్మేవారు. ఒకరకంగా చెప్పాలంటే మానవజాతి చరిత్రలో అతి పురాతనమైన శస్త్రచికిత్సా పద్ధతిగా దీన్ని చెప్పవచ్చు.

ఈ పద్ధతిలో మనిషి పుర్రెలో రంధ్రం చేసేవారు. అంటే మనం ఇప్పుడు నీళ్లకోసం నేలలో బోర్ వేస్తాం కదా. అలాగన్నమాట. ఈ ట్రెపానింగ్ అనే పదం కూడా గ్రీకు పదమైన ట్రుపనాన్ నుంచి పుట్టింది. దీని అర్థం బోరర్ అంటే రధ్రం చేయువాడు అని అన్నమాట. ప్రపంచమంతటా దాదాపు 10 వేల సంవత్సరాల క్రితమే ఈ తరహా వైద్య పద్ధతిని మనుషులు అవలంబించేవారు మరి.

ఈ పద్ధతిలో పుర్రెకు రంధ్రాలు దింపేవారు. వేధిస్తున్న తలనొప్పులను తగ్గించడానికి మాత్రమే కాక, మెదడులోని అవకతవకలను సరిచేయడానికి కూడా అంటే దెయ్యాలు, భూతాలు మనుషులను పట్టి పీడించడం అనేదాన్ని మనుషులు నమ్మడం మొదలు పెట్టాక వాటిని మన మెదడులోంచి పారదోలడానికి కూడా పుర్రెకు రంధ్రాలు వాడేవారు.

అయితే తలకు లేదా పుర్రెకు ఆకాలంలో రంధ్రాలు పెట్టడం వంటి శస్త్ర చికిత్స చేసిన తర్వాత కూడా నాటి మనుషులు బతికి ఉండేవారని, ఇంకా ఇలాంటి రంధ్రాలు పెట్టవలసిందిగా మళ్లీ మళ్లీ ఆనాటి వైద్యుల వద్దకు వచ్చేవారని నిరూపించే సాక్ష్యాధారాలు కూడా ఇప్పటి మన శాస్త్రజ్ఞులకు దొరికాయి.

ఈ పుర్రెకు రంధ్రం పెట్టే శస్త్రచికిత్స చేసేటపుడు రోగికి ఎలాంటి మత్తుమందు ఇవ్వకుండా కూర్చుండబెట్టి మరీ ఆనాటికి లభ్యమైన రాతి సూదులతో తలలో రంధ్రం పెట్టేవారట. వైద్య సౌకర్యాలు పెద్దగా లేని మన పల్లెటూర్లలో ఈ రోజు కూడా ఎవరికైనా కాల్లో ముల్లు బలంగా దిగితే, స్పృహలో ఉండగానే పాదంలోని చర్మాన్ని కత్తితో కోసి మరీ విరిగిన ముల్లును తీస్తున్నారు కదా.

ఆరోజు తలకు రంధ్రం చేసే వైద్యం ప్రచారంలో, ప్రయోగంలో కూడా ఉనికిలో ఉండటంలో ఆశ్చర్యం ఏముంది.

నిజంగానే వింతవైద్యమే కదూ...

కింది ఉదాహరణను చూడండి మరి...

Skulls from ancient graves show that trepanning was practiced in many pre-civilization cultures including Egypt, Celtic cultures, China, India and Polynesia. But most skull finds come from the South American civilizations (Aztec, Mayan and Inca). During historic times it was practiced in Bolivia and Peru.

Inca surgeons often inserted a silver plate to close the hole. The degree to which the skull bone covered the plate is a good indication for the patient's life span after the operation.

In 1962, a Peruvian neurosurgeon performed the technique using Aztecan tools in a modern setting on a head-trauma victim. The patient survived.


స్పందనలు

Re: తలకు రంధ్రం పెడితే సరి... రోగం హుష్ కాకి...
సార్... నిజంగా నమ్మలేని నిజాలు ఇంకా కొనసాగిస్తున్నారన్నమాట... మంచిది ఇవే కదా అక్కడ అవసరం... విజృంభించండి అంతే.... తెలియని ఇంకా ఎన్నో విషయాలు మాకు మీరు ఈ విధంగా తెలిపాలని కోరుకుంటూ మీ హర్ష
Re: తలకు రంధ్రం పెడితే సరి... రోగం హుష్ కాకి...
అయ్యో.. ఇవి నమ్మలేని నిజాలు కాదు మిత్రమా... ఇవి మన చరిత్రలో నిజంగా జరిగిన నిజాలు. పురావస్తు పరిశోధనల సాక్షిగా చరిత్రలో బయటపడిన నిజాలు. ఆనాటి మనిషి హేతుజ్ఞానం పరిమితుల్లో ఇలా చేస్తే ఇలా జరుగుతుందన్న ఊహతో మొదలుపెట్టిన వైద్యవిధానాలు. ఇలాంటివి ఇప్పటికీ మన గ్రామీణ ప్రపంచంలో వేరు రూపంలో ఉన్నాయని అంటే అతిశయోక్తి కాదు. పచ్చకామెర్ల వస్తే రాయలసీమ ప్రాంతంలో చేతికి, బొడ్డుకు, ఇతర చోట్ల నిప్పుల్లో కాల్చిన వలయాకారపు ఇనుప కడియంతో వాత పెట్టేవారు. ఈ రోజుల్లోనూ దీన్ని నమ్ముతున్నారు. కామెర్లకు ఇప్పటికీ మూలికల వైద్యమే పల్లెల్లో ప్రచారంలో ఉంది. ఇలాంటివి ఎన్నో మరి. కాబట్టి వీటిని చరిత్రలో కొనసాగుతూ వస్తున్న నిజాలుగానే చూడాలి. మన పరిణామక్రమం ఇలాగే మొదలయ్యిందని అర్థం చేసుకుంటే చాలు... వ్యాఖ్యకు ధన్యవాదాలు...
Re: తలకు రంధ్రం పెడితే సరి... రోగం హుష్ కాకి...
అవును సార్... నమ్మలేని నిజాలు అన్నది దేనికీ అంటే నేను దీన్ని నిజంగా నమ్మాను కాబట్టే నమ్మలేని దాని వలె అభివర్ణించాను... ఏమైనా ఇటువంటి మూఢనమ్మకాలు కొనసాగుతూనే ఉంటాయని నా అభిప్రాయం ఎందుకంటే దేశం సాంకేతికంగా ఎంత ముందుకు పోతున్నా అది పల్లెల వరకు వెళ్లకపోవడమే.
Re: తలకు రంధ్రం పెడితే సరి... రోగం హుష్ కాకి...
నిజం.. ఇది చాలా కరెక్టు.. నిజమైన వైద్యం, జ్ఞానం పల్లెలకు ఇంకా చేరకపోవడమే... అది పల్లెల తప్పు కాదు. మనుషుల తప్పు అంతకంటే కాదు..
నిరాకరణ