Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

మరీ వాసనేస్తున్నారు.. కాస్త వెళతారా..


ముక్కుపుటాలను అదరగొట్టే దుర్వాసన అంటే ఎవరయినా ముక్కు మూసుకోవలసిందే మరి. అందులోనూ మనిషి చెమట వాసన అయితే ఇక చెప్పనవసరం లేదు. చెమట కంపు కొడితే ప్రియురాలు అయినా సరే అసహ్యించుకుంటుందని మనం ఎన్ని టీవీ ప్రకటనలలో చూడలేదు మరి. అలాంటిది సూపర్ మాల్‌కి పోయి చెమట కంపు గొడితే వాళ్లూరుకుంటారా..

ఊరుకోరనే ఈ కథనం చెబుతోంది. లండన్ నగరంలో క్రిస్ గాంటన్ అనే ఓ 29 ఏళ్ల మహిళ, అప్పుడే జాలీగా గుర్రపు స్వారీ చేసి వచ్చింది. ఇంటికి పోతూ, దోవలో సూపర్‌మాల్ ఎదురయితే ఇంటికి కాస్త సరుకులు తీసుకెళితే పోలా అనుకుంది. ఆలోచన వచ్చిందే తడవుగా మాల్‌లోకి దూరింది.

ఎంత ఏసి అయితే మాత్రం గుర్రపుస్వారీ చేసినపుడు పట్టిన చెమట వాసన పోతుందా మరి.. ఆమె తన పాటికి తాను లండన్లోని టెస్కో సూపర్ మార్కెట్టులో సరుకులు బాస్కెట్‌లో వేసుకుంటోంది. పాపం.. ఆమె చెమట వాసన ఇతరులు భరించలేక విసుక్కుంటూంటే పరిశీలించాడో లేక తనకే వికారం పుట్టిందో గాని మాల్ భద్రతా గార్డు ఒకరు ఆమెను నిలేశారు.

మరీ ఎక్కువగా వాసనేస్తున్నారు. ఇక్కడ మాల్ భద్రత, ఆరోగ్యం కారణంగా దయచేసి బయటకు వెళతారా అని అడిగాడు గార్డు. దీంతో బిత్తరపోయిందామె. గుర్రపు స్వారీయే కదా చేసింది. ఆ మాత్రానికే ఇంతలా వెళ్లిపోమని అడగాలా అని అనుకోకుండా బుద్ధిగా బయటకు పోయిందామె.

తూర్పు లండన్ విశ్వవిద్యాలయం అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్న గాంటన్ తర్వాత టెలిగ్రాప్ పత్రికకు ఈ విషయాన్ని వివరిస్తూ ఆ గార్డు సున్నితంగా చెప్పిన మాటలను అలాగే వల్లెవేసింది. 'మీరు మరీ చమట కొడుతున్నారు.. కాస్త బయటకు వెళ్లండి'.

మరి సాధారణ గార్డుకయినా చెమట.. అందులోనూ మనిషి చెమట.. అంటే భరించడం కష్టమే కదా.. అయినా మన ఆర్టీసీ బస్సుల్లో, రైళ్లలో, మార్కెట్లలో కిక్కిరిసిన జనం తొక్కిడిలోంచి పుట్టే చెమట వాసనను చూస్తే ఆ గార్డు ఇంకేం అని ఉండేవాడో మరి.

స్పందనలు

Re: మరీ వాసనేస్తున్నారు.. కాస్త వెళతారా..
అవును రాజు గారూ... చమట చమటకో చరిత్ర ఉంటుంది మరి. శ్రామికుడు చమట వెలకట్టలేనిది.. ఒకవేళ అతనికి గనక చమట పట్టలేదే అనుకోండి... మన పని మటాష్... తింటాను కూడు, వేసుకోవడానికి బట్టలు, ఉంటానికి ఇల్లు దొరకవు కదూ... ఇది పనీపాటు లేని గుర్రపు స్వారీ చమట వాసన కనుక.. మనమూ ముక్కు మూసుకోవలసిందే... ఏమంటారు..?
Re: మరీ వాసనేస్తున్నారు.. కాస్త వెళతారా..
Hi Raju Gaaru, Still continuing the ZEAL!! Thanks for the efforts! With regards, benny
నిరాకరణ