Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

విమర్శ ఏకాంతంలో.. ప్రశంస నలుగురిలో..


నాయకుడు అనేవాడు తన బృందంలో ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసేవాడు కావాలి. ఎక్కడెక్కడ ఎవరెవరికి ప్రశంస అందాలో దాన్ని నలుగురిలో అందించాలి. వారిని విమర్శించవలసి వస్తే ఏకాంతంలో పిలిచి విమర్శించాలి. సిబ్బంది నుంచి విధేయతను ఆశించడం కన్నా వాళ్లు తమ పనిలో నిమగ్నులు కావడాన్నే లక్ష్యంగా చేసుకోవాలి.

మనిషిని ఉత్పాదకశీల నాయకుడిగా రూపొందించేది ఏది? తన సిబ్బంది విషయంలో పూర్తి అధికారాలుండి తనకి అనుకూలంగా సిబ్బందిని నియమించుకోగలిగే వాడే నా ఉద్దేశ్యంలో ఉత్పాదకశీల నాయకుడు అవుతాడు. అతడు తన సంస్థకు కొత్త రక్తాన్ని ఎక్కిస్తూ ఉండాలి. సమస్యలతో కొత్త భావాలతో వ్యవహరించగల నిపుణుడై ఉండాలి.

కలాం

నిరాకరణ