Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

బిల్‌గేట్స్‌కు బంటాసింగ్ ఉత్తరం....!

To
Bill gates
Microsoft


సబ్జెక్ట్: నా కొత్త కంప్యూటర్‌తో సమస్యలు

డియర్ బిల్ గేట్స్ భాయ్,

మేము ఇటీవలే ఓ కంప్యూటర్ కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకున్నాము. కాని మాకు దాంతో కొన్ని సమస్యలు వస్తున్నాయి. వాటిని మీ దృష్టికి తీసుకువద్దామని అనుకుంటున్నాను.

1. మా కొత్త కంప్యూటర్లో 'స్టార్ట్ బటన్' ఉంది కాని 'స్టాప్ బటన్' లేదు. దయచేసి దీనిని చెక్ చేయండి.

2. మరో సందేహమేమిటంటే... సిస్టంలో ఏదైనా 'రీ స్కూటర్' ఉందా? నాకు సిస్టంలో 'రీ సైకిల్' మాత్రమే కనిపిస్తోంది. అయితే నాకు ఇంటివద్ద స్వంత స్కూటర్ ఉంది మరి..!

3. సిస్టంలో 'ఫైండ్' బటన్ ఉంది కాని అది సరిగా పనిచేయడం లేదు. నా భార్య డోర్ కీ పోగొట్టుకుంది. సిస్టంలోని 'ఫైండ్' బటన్‌ సహాయంతో ఆ డోర్ కీ కోసం మేము చాలా గాలించాం కానీ అది కనబడలేదు. దయచేసి ఈ సమస్యను పరిష్కరించు భాయ్..!

4. మా అబ్బాయి 'మైక్రోసాఫ్ట్ వర్డ్' నేర్చేసుకున్నాడు. ఇప్పుడు 'మైక్రోసాఫ్ట్ సెంటెన్స్' నేర్చుకోవాలనుకుంటున్నాడు. దాన్ని మీరు ఎప్పుడు అందజేస్తారు భాయ్?

5. మేం కంప్యూటర్, సిపియు, మౌస్, కీబోర్డులను కొన్నాము. అయితే మోనిటర్‌లో 'మై కంప్యూటర్' మాత్రమే కనిపిస్తోంది. మిగతావి మీరు ఎప్పుడు అందజేస్తారు...

6. మాకు ఒక విషయం మాత్రం అర్థం కాలేదు భయ్. విండోస్ 'మై పిక్చర్స్' గురించి చెబుతోంది. అయితే దాంట్లో నా ఫోటో ఒక్కటి కూడా లేదేంటి. దాంట్లో నా ఫోటో ఎప్పుడు పెడతావ్ భాయ్.....

7. సిస్టంలో 'మైక్రోసాప్ట్ ఆఫీస్' ఉంది.... మరి 'మైక్రోసాఫ్ట్ హోమ్' మాటేమిటి.. ఎందుకంటే కంప్యూటర్‌ను నేను ఇంట్లోనే వాడుతున్నా మరి.

8. 'మై రీసెంట్ డాక్యుమెంట్స్‌'ను సిస్టంలో అందించావు సరే.. 'మై పాస్ట్ డాక్యుమెంట్స్‌'ను ఎప్పుడు అందిస్తావ్ జర చెప్పు భాయ్...

9. సిస్టంలో 'మై నెట్ వర్క్ ప్లేసెస్' అందించావు. అయితే 'మై సీక్రెట్ ప్లేసెస్' మాత్రం అందించకు భాయ్.. ఆఫీసు పని పూర్తయిన తర్వాత నేనెక్కడికి పోతున్నానో నా భార్యకు చచ్చినా తెలీకూడదు మరి..!

ఇట్లు
భవదీయుడు
బంటా సింగ్

గమనిక:

గేట్స్ భయ్.. చివరగా మరొక్క చిన్న సందేహం...

నువ్వేమో 'విండోస్‌ను అమ్ముతున్నావు... నీ పేరుమాత్రం గేట్స్ అని పెట్టుకున్నావు... ఎందుకు భాయ్....???

స్పందనలు

Re: బిల్‌గేట్స్‌కు బంటాసింగ్ ఉత్తరం....!
గేట్స్ భయ్.. చివరగా మరొక్క చిన్న సందేహం... నువ్వేమో 'విండోస్‌ను అమ్ముతున్నావు... నీ పేరుమాత్రం గేట్స్ అని పెట్టుకున్నావు... ఎందుకు భాయ్....??? అదిరిందండీ ఆర్టికల్..!!!
నిరాకరణ