Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

టెక్నాలజీ అంటే యంత్రభూతం కాదు...


భారతదేశంలో నేటికి కూడా టెక్నాలజీ అనే పదం చాలా మందికి పొగలు గక్కే కర్మాగారాల్నీ, యంత్రభూతాల్నీ గుర్తుకు తెస్తూంటూంది. కానీ అది టెక్నాలజీకి సరయిన అర్థం కాదు. ఒకప్పటి గుర్రపు కళ్లెం సాంకేతిక ఆవిష్కరణే. అలాగే తదనంతర కాలంలో లోహపు కొలిమి కూడా అటువంటి ఆవిష్కరణే.

టెక్నాలజీ అంటే సాంకేతిక సూత్రాలూ పద్ధతులూ, వాటిని ఉపయోగించే యంత్రాలు అన్ని వేళలా టెక్నాలజీలో భాగం కావచ్చు. కాకపోవచ్చు. అందువల్ల సాంకేతిక పరిజ్ఞానం అంటే ఒక రసాయనంతో ఎట్లా పనిచేయించవచ్చో తెలియడం కావచ్చు. చేపల్ని పెంచే పద్ధతులు కావచ్చు. కలుపును నిర్మూలించే పద్ధతులు కావచ్చు. థియేటర్లలో దీపాలు అమర్చే పద్ధతి కావచ్చు. చరిత్రను బోధించే పద్ధతి కావచ్చు. యుద్ధాలు చెయ్యడం కావచ్చు. లేదా వాటిని నివారించగలగడం కావచ్చు.

ఈ రోజు చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో ఉత్పత్తి కార్యక్రమాలు అసెంబ్లీ లైన్లనీ, ఇనుప కొలుముల్నీ దాటి నిర్వహించబడుతున్నాయి. ఎలెక్ట్రానిక్స్‌లో, అంతరిక్ష పరిజ్ఞానంలో, చాలా కొత్త పరిశ్రమల్లో పరిశుభ్ర, నిశ్శబ్ద పరిసరాలు ఎంతో ముఖ్యమైన అంశం. సరళమైన పనులు చెయ్యడానికి వందలాది మనుషులు కన్వేయర్ బెల్ట్ చుట్టూ బారులు దీరి నిల్చుండే అసెంబ్లీ లైన్ ఇప్పుడొక చారిత్రక ఆడంబరం మాత్రమే.

కలాం....

స్పందనలు

Re: టెక్నాలజీ అంటే యంత్రభూతం కాదు...
సార్.. సాంకేతికత గురించి మరింత విఫులంగా ఇచ్చి ఉంటే మా లాంటి వాళ్లకు పనికి వస్తుందేమో. వీలైతే ఇవ్వండి..
నిరాకరణ