Webdunia: Portal - Search - Mail - Greetings   More >>
Support | Font Download | Feedback
Search  
Welcome, Guest  [ Register | Sign In ]

ఏడేళ్లుగా సంపాదన లేదు : జ్ఞానేంద్ర


తరతరాలుగా రాజవంశీకులు కూడబెట్టిన వెలలేని సంపదనలను తాను విదేశాలకు తరలించినట్లుగా వచ్చిన వార్తలను నేపాల్ మాజీ రాజు జ్ఞానేంద్ర ఖండించారు. గత ఏడేళ్లుగా తాను చిల్లిగవ్వ కూడా సంపాదించలేదని మీడియాకు స్పష్టం చేశారు. తన ఆస్తులన్నీ నేపాల్‌లోనే ఉన్నాయని, తన సంపదలన్నీ ఇప్పుడు జాతీయం చేయబడినాయని పేర్కొన్నారు.

రాజమందిరాన్ని ఖాళీ చేయడానికి ముందుగా పత్రికా సదస్సులో ప్రసంగించిన జ్ఞానేంద్ర తాను నైపాల్ వదిలి పెళ్లడం లేదని ప్రకటించారు. నేపాల్‌లోనే ఉంటూ దేశ ప్రగతి, పురోగతికి పాటుపడతానని హామీ ఇచ్చారు.

నేపాల్‌లోని ప్రపంచపు చిట్ట చివరి హిందూ రాజరికానికి గత నెలలో తెరపడిన విషయం తెలిసిందే. 240 ఏళ్ల పాటు కొనసాగిన రాజరికాన్ని రద్దు చేస్తూ నేపాల్ నూతన రాజ్యాంగ సభ గతనెలలో తీర్మానం చేయడంతో చిట్ట చివరి హిందూ రాజు జ్ఞానేంద్ర తన కిరీటాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే.

నిరాకరణ