నాయకులు చాలామంది పని జరగడం అలా ఉంచి తమ తమ ధోరణిలో కార్యకర్తలపైన ఎక్కువ మొగ్గు చూపుతారు. కొందరు ఫలితాలు రాబట్టడం మీద ఎక్కువ దృష్టి పెట్టి కార్యకర్తలు ఎలా పోతేనేమి అనుకుంటారు. మనుషుల్ని కేవలం తమ లక్ష్యాలను సాధించడానికి పనికొచ్చే పరికరాలుగానే వాళ్లు భావిస్తారు.
కొందరు పనికి తక్కువ ప్రాధాన్యత ఇచ్చి తమ కార్యకర్తల అభిమానాన్ని చూరగొనడం మీద ఎక్కువ ఆసక్తి చూపుతారు. కానీ, 'అగ్ని' బృందం పని నాణ్యతను, కార్మిక సంబంధాలను రెండింటినీ కూడా అత్యున్నత స్థాయిలో సమన్వయపరచగలిగింది.

లోడ్ అవుతోంది...