దేశంలోని శాస్త్రవేత్తలందరూ సాంకేతిక నిపుణులందరూ కలిసి పనిచేస్తే సాధించలేనిది ఏదీ లేదని భావించాను. విశ్వవిద్యాలయాలూ, వైజ్ఞానిక ప్రయోగశాలలూ కలిసి పనిచేస్తే ఉన్నత సాంకేతిక సామర్థ్యాన్ని సాధించడం సాధ్యమే. భారత పారిశ్రామిక రంగం వస్తువుల తయారీ మాత్రమే తన పాత్రనుకుంటోంది. ఆ ఆత్మన్యూనతా భావన నుంచి దాన్ని బయట పడవెయ్యగలిగితే అది అద్భుత ఫలితాలనివ్వగలదు.
అందుకు మేమొక త్రిముఖ వ్యూహాన్ని అనుసరించాం. ఒకటి. వీలైనన్ని ఎక్కువ సంస్థలతో భాగస్వామ్యం, రెండవది వారందరి మధ్యా సహ సంబంధ వైఖరి నెలకొనేలా చూడడం. మూడవది మన సాంకేతిక పరిజ్ఞానం మనల్ని బలోపేతుల్ని చేసేలా చూడటం. ఈ మూడు చెకుముకి రాళ్లను రాపాడగా 'అగ్ని' పుట్టింది
లోడ్ అవుతోంది...