పెద్ద పెద్ద శాస్త్రీయ ప్రణాళికలు మహా పర్వతాల్లాంటివి. వాటిని తొందరపడకుండా, మనని అలసట పెట్టుకోకుండా, నిదానంగా అధిరోహించాలి. నీ వేగం నీ స్వధర్మానికి అనుగుణంగా ఉండాలి. నువ్వుండబట్టలేకపోతే వేగం పెంచు. ఒత్తిడి మొదలయ్యిందా వేగం తగ్గించు.
నువ్వొక సమతూక మనఃస్థితిలోనే పర్వతారోహణ సాగించాలి. నీ ప్రాజెక్ట్‌లోని ప్రతి ఒక్క అంశాన్ని దానికదే ఒక అద్వితీయ సంఘటన అని నువ్వు భావించుకోగలిగినప్పుడే పనిలో సక్రమంగా ముందుకు పోతున్నట్లు.
లోడ్ అవుతోంది...