నూతన ప్రపంచ వ్యవస్థ సాంకేతిక ఆధిక్యత మీద ఆధారపడి ఉంది. నీ శత్రువుకి ఆధునిక పరిజ్ఞానం లేకుండా చెయ్యి. అప్పుడతడు నువ్వు చెప్పినట్లు వింటాడు. నాకది రెండువేల ఏళ్ల కిందట ఒక చైనా తాత్వికుడు చెప్పిన మాటలు గుర్తు తెస్తున్నాయి.
అతనేమన్నాడంటే ఒక శత్రువును జయించాల్సింది అతని సైనికుల్ని ఒక్కొక్కర్నే హతమార్చడం ద్వారా కాదు. ముందతని సంకల్ప శక్తిని దెబ్బతియ్యి. అప్పుడతను ఓటమిని అంగీకరిస్తాడు. బహుశా అది ఈ సాంకేతిక ఆధిక్యత గురించిన సూచనే అయి ఉంటుంది. ఇరవై శతాబ్ది యుద్ధతంత్రాన్ని అతడు ఆనాడే ఊహించినట్లుంది.
లోడ్ అవుతోంది...